Thursday, May 9, 2024

పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సూచించారు. ఫిర్యాదుదారులను భయాం దోళనకు గురి చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఉన్నదే ప్రజల కోసమని గుర్తించాలని పేర్కొంది. పోలీస్ విధులను గుర్తు చేసేలా అవగాహనా తరగతులు నిర్వహించాలని డిజిపికి ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారని చురక అంటించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు చాలా కష్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరీంనగర్ టూటౌన్ పిఎష్ మహిళా ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేయకపోవడంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ చేపట్టని హైకోర్టు ధర్మాసనం..పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని డిజిపిని ఆదేశించింది. తప్పుడు ఫిర్యాదు అయినా తీవ్రమైన ఆరోపణలుంటే ఎఫ్ ఐఆర్ నమోదు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈకేసులో ఇన్ స్పెక్టర్ ఆఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News