Wednesday, May 15, 2024

మార్చి 9 తరువాత షెడ్యూల్

- Advertisement -
- Advertisement -

కశ్మీరులో పర్యటించనున్న ఇసి బృందం
న్యూఢిల్లీ: ఎన్నికల కసరత్తును ముగించేందుకు చివరిసారి రాష్ట్రాల పర్యటనలో తలమునకలై ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 9వ తేదీ తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. 15వ లోక్‌సభకు సభ్యులను ఎన్నుకునేందుకు జరగనున్న ఎన్నికలు ఏప్రిల్, మే నెల మధ్యలో ఉండే అవకాశం ఉంది. లోక్‌సభతోపాటు మరి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన ఎన్నికల సంఘం అధికారులు వివిధ రాష్ట్రాలను విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీరులో భద్రతా పరిస్థితిని, భద్రతా దళాల అభ్యతను తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు మార్చి 8-9 తేదీలలో ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీరులో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నదీ లేనిదీ అంచనా వేసేందుకు ఇసి ప్రతినిధులు మార్చి 12-,13 తేదీలలో ఆ రాష్ట్రాన్ని క్షేత్ర స్థాయి పర్యటన చేయనున్నారు. వి2019 లోక్‌స భ ఎన్నికల ప్రకటన మార్చి 10న వెలువడింది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశలలో పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు మే 23న జరిగింది. ఈసారి కూడా అదే తరహాలో ఎన్నికల షెడ్యూల్ ఉండే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలలో లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉంది. పరిస్థితి అనుకూలంగా ఉందని ఇసి భావిస్తే జమ్మూ కశ్మీరులో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News