Monday, May 13, 2024

ఇమ్రాన్ ఖాన్ విడుదలకు డిమాండ్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : బందీగా ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇతర నేతలను విడుదల చేయాలన్న డిమాండ్‌తో తీర్మానాన్ని ఆ పార్టీ ప్రతినిధులు సెనేట్‌కు బుధవారం సమర్పించారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఇఇన్సాఫ్ (పిటిఐ) సంస్థాపక నేత ఇమ్రాన్ ఖాన్‌తోపాటు , ఆయన భార్య బూష్రాబీబీ, మాజీ విదేశాంగ మంత్రి షా మొహమూద్ ఖురేషీ, డాక్టర్ యాస్మిన్ రషీద్, పార్టీకి చెందిన ఇతర మహిళా నేతలు, జర్నలిస్టులను విడుదల చేయాలని ఆ తీర్మానంలో డిమాండ్ చేశారు.

పార్టీకి చెందిన సెనేటర్ ఫలక్ నాజ్ చిత్రాలి ఈ తీర్మానాన్ని సెనేట్‌కు బుధవారం సమర్పించారు. 71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, 67 ఏళ్ల ఖురేషీ రావల్పిండి లోని అడియాలా జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో అనేక కేసుల్లో బందీగా ఉన్నారు. వారంతా బూటకపు కేసుల్లో బందీ అయ్యారని తీర్మానం పేర్కొంది. రాజకీయ కక్ష దేశ ఆర్థిక రంగాన్ని, గౌరవాన్ని నాశనం చేస్తుందని తీర్మానంలో విమర్శించారు. ఇటువంటి తీర్మానాన్ని మంగళవారం నేషనల్ అసెంబ్లీకి కూడా సమర్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News