Monday, May 13, 2024

డిఎంకె కూటమితో కమల్ హాసన్ పార్టీ పొత్తు

- Advertisement -
- Advertisement -

చెన్నై: నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ సారథ్యంలోని మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) శనివారం డిఎంకె నేతృత్వంలోని కూటమిలో చేరింది. రానున్న లోక్‌సభ ఎన్నికలలో డిఎంకె కూటమి తరఫున ప్రచారం చేయనున్నట్లు ఎంఎన్‌ఎం ప్రకటించింది. 2025లో జరిగే రాజ్యసభ ఎన్నికలలో తమకు ఒక సీటును కేటాయించినట్లు ఆ పార్టీ ప్రకటించింది. కమల్ హాసన్ పార్టీకి లోక్‌సభ ఎన్నికలలో సీట్లను కేటాయిస్తారని ఊహాగానాలు సాగుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. చెన్నైలోని డిఎంకె ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో డిఎంకె అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, కమల్ హాసన్ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది.

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తమ పార్టీ డిఎంకె సారథ్యంలోని కూటమిలో చేరినట్లు చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ కమల్ హాసన్ తెలిపారు. తాము ఎటువంటి పదవులను ఆశించడం లేదని ఆయన చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో తాము పోటీ చేయడం లేదని, డిఎంకె సారథ్యంలోని కూటమికి సంపూర్ణ మద్దతును అందచేస్తామని ఆయన తెలిపారు. ఇది పదవుల కోసం కాదని, దేశం కోమని ఆయన అన్నారు. ఇద్దరు నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఏకైక లోక్‌సభ స్థానంలో ఎంఎన్‌ఎం కూటమి తరఫున ప్రచారం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News