Thursday, May 9, 2024

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన ముషీర్ ఖాన్

- Advertisement -
- Advertisement -

ముంబై: యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో నయా రికార్డును నెలకొల్పాడు. విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌లో చిరస్మరణీయ శతకం సాధించాడు. విదర్భ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ముషీర్ ఖాన్ 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులు సాధించాడు. దీంతో రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ సాధించిన పిన్న వయసు బ్యాటర్‌గా నయా రికార్డు సృష్టించాడు.

ముషీర్ ఖాన్ 19 ఏళ్ల వయసులో రంజీ ఫైనల్లో శతకం బాదాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. సచిన్ 199495 రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. అప్పుడు సచిన్ వయసు 22 ఏళ్లు. తాజాగా ముషీర్ ఖాన్ 19 ఏళ్ల వయసులో శతకం సాధించి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News