Thursday, August 28, 2025

వారెంట్ లేకుండా మహిళను అరెస్టు చేయడం అన్యాయం

- Advertisement -
- Advertisement -

న్యాయవాది సోమా భరత్ తీవ్ర అభ్యంతరం

బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితను ఇడి అరెస్ట్ చేయడంపై ఆమె తరఫు న్యాయవాది సోమా భరత్ తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో చెప్పిన దానికి భిన్నంగా ఇడి అరెస్ట్ చేసిందని విమర్శించారు. ఎలాంటి వారెంట్ లేకుండా ఓ మహిళను అరెస్ట్ చేయడం కూడా అక్రమమే అవుతుందన్నారు. తీర్పు వచ్చే వరకు తాము ఎలాంటి చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టులో చెప్పి… అందుకు భిన్నంగా కవితను అరెస్ట్ చేయడం పూర్తిగా అన్యాయం… చట్టవిరుద్ధమన్నారు. మహిళలు, పిల్లలను అరెస్ట్ చేసే సమయం వారిని విచారించే సమయం గురించి ఇప్పటికే కవిత పోరాడుతున్నారని, త్వరలో సుప్రీంకోర్టులో తీర్పు రానుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News