Tuesday, May 21, 2024

కెసిఆర్‌కు నిద్రపట్టడం లేదు: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో చేరికలతో మాజీ సిఎం కెసిఆర్‌కు నిద్రపట్టడం లేదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విమర్శించారు. పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కెసిఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవాలను దాచి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కెసిఆర్ మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు సిఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుతారనుకోలేదన్నారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. నీళ్లు, కాళేశ్వరం గురించి కెసిఆర్ నిజాలు చెప్పలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

మీటింగ్‌లో మైక్ సమస్య వస్తే కరెంట్ కోతలు అంటూ అబద్ధం మాట్లాడారంటూ ఆయన మండిపడ్దారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు బిఆర్‌ఎస్ పాలనే కారణమని ఆయన ఆరోపించారు. సరిదిద్దుకోలేనంత తప్పిదాలు గత ప్రభుత్వమే చేసిందన్నారు. అస్థవ్యస్థమైన అర్థిక వ్యవస్థను మూడు నెలల నుంచి గాడిలో పెడుతున్నామన్నారు. కెసిఆర్ చేసిన అప్పుల్ని ఇప్పటికి తీర్చలేకపోతున్నామన్నారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మించిన స్థలమే కరెక్ట్ కాదని ఆయన చెప్పారు. పర్యావరణ అనుమతులు తెచ్చుకోకపో వడం వల్లే యాదాద్రి ప్రాజెక్టు ఆలస్యమవుతుందని ఆయన వెల్లడించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు..? , ఎవరి వల్ల ఆలస్యమైందో చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News