న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై సిఎం రేవంత్ సంతాపం

117

దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై సిఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ మరణం బాధాకరమన్నారు. మీడియా రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారని సిఎం రేవంత్ గుర్తు చేశారు. శాంతిస్వరూప్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సిఎం ప్రార్థించారు.

కాగా, రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన శాంతి స్వరూప్ హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవరం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ చానల్లో ఆయన తెలుగులో తొలిసారి వార్తలు చదివారు. పదేళ్లపాటు టెలీప్రాంటర్ లేకుండా పేపర్ చూసి వార్తలు ప్రజలకు వినిపించారు. తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా ఆయన చెరగని ముద్ర వేశారు. శాంతిస్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.