Tuesday, May 21, 2024

ఎవరినో పిఎం, సిఎం చేయడానికి బిజెపి ఏర్పడలేదు: ఫడ్నవిస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :ఎవరినైనా ప్రధానిని లేదా ముఖ్యమంత్రిని చేయడం కోసం భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించలేదని, అందువల్ల పార్టీలో అంతర్గత చీలికలన్నవి ఎదురుకావని, మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం వెల్లడించారు. దేశ చరిత్రలో తమ పార్టీయే ఏకైక జాతీయ పార్టీ అని, చీలిక అన్నది ఎప్పుడూ అనుభవం కాలేదని పేర్కొన్నారు. బీజేపీ 44వ సంస్థాగత దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలతో ఫడ్నవిస్ మాట్లాడారు.

అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను రూపొందించేందుకు ప్రధాని నరేంద్రమోడీ సైనికులుగా పార్టీ కార్యకర్తలు సమష్టిగా పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పాయ్, ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి నుంచి ప్రధాని మోడీ వరకు అందరూ పార్టీ పురోగతి కోసమే కృషి చేశారని వివరించారు. బీజేపీ నేతలు ఎప్పుడూ స్వార్థపరులు కారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బాల్ థాకరే స్థాపించిన శివసేన, శరద్‌పవార్ నెలకొల్పిన నేషనలిస్ట్ కాంగ్రెస్ అంతర్గత సంక్షోభం వల్ల ఏ విధంగా చీలిపోయాయో ఉదహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News