Friday, May 31, 2024

కేంద్ర మంత్రిపై వీరశైవ మఠాధిపతి పోటీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ప్రమఖ వీరశైవ లింగాయత్ సాధువు, షిరహట్టి ఫక్కీరేశ్వర మఠాధిపతి ఫకీరా దింగలేశ్వర్ స్వామి ప్రకటించారు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఓడించడానికే తాను పోటీలో దిగుతున్నానని సోమవారం స్వామీజీ తెలిపారు.

వీరశైవ లింగాయత్‌లను, ఇతర కులాలను ప్రహ్లాద్ జోషి అణచివేస్తున్నారని, అధికారం కోసం లింగాయత్ మఠాలను దుర్వినియోగం చేస్తూ వాటికి చెడ్డపేరు తెస్తున్నారని ఆయన ఆరోపించారు. ధార్వాడ్ నియోజకవర్గం కోసం జాతీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయని, రెండు జాతీయ పార్టీలు ఎన్నికలలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని నియోజకవర్గం ప్రజలు భావిస్తున్నారని స్వామీజీ తెలిపారు. కాగా..ఈ ఆరోపణలకు తాను ఏమీ సమాధానం ఇవ్వబోనని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. స్వామీజీ ఏమి చెప్పినా తనకు అవి ఆశీర్వచనాలేనని జోషి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News