Sunday, July 20, 2025

ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి సిఎం పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని మంత్రులు, ఎంఎల్‌ఎలు, అధికారులు దర్శించుకున్నారు. అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. బోనాల వేడుకకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణంలో పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెళ్లు, ఫలహార బండ్ల ఊరేగింపు కోలాహలంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News