Sunday, September 14, 2025

ఐఫోన్ 16 లాంచ్.. అద్భుతమైన ఫీచర్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 15 మోడల్స్ ధరలు గణనీయంగా తగ్గిస్తున్నట్టు యాపిల్ కంపెనీ ఐఫోన్ 16 విడుదల సందర్భంగా ప్రకటించింది. ఐఫో న్15 128జిబి వేరియంట్ ధర ప్రస్తుతం రూ.69,900కు తగ్గగా, ఇంతకుముందు ఇది రూ.79,600 గా ఉంది. అలాగే ఐఫో న్14 128జిబి వేరియంట్ ధర రూ. 69,600 నుంచి రూ.59,900 వరకు తగ్గింది. అంటే రూ.10 వేల వరకు తగ్గుద ల ఉంది. ఆపిల్ లాంచ్ చేసిన సరికొత్త ఐఫోన్-16లో అతిపెద్ద మార్పు ఇంటెలిజె న్స్, దీంతోపాటు కెమెరా నియంత్రణ కోసం కొత్త బటన్ ఇచ్చారు.

ఇది సెప్టెంబర్ 20 నుండి భారతదేశంలో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్-16, ఐఫోన్-15 ధరల్లో కేవలం రూ.10,000 మాత్రమే వ్యత్యా సం ఉంది. కెమెరా ఆకారం కాకుండా ఐఫోన్-16 పరిమాణం, ఆకారం దాదాపు ఐఫోన్- 15 మాదిరిగానే ఉంటుంది. ఐఫోన్-16లో ఎ18 చిప్ అందుబాటులో ఉం టుంది. ఇది రెండో తరం 3 ఎన్‌ఎం సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఎ16 బయోనిక్ చిప్ ఐఫోన్–15లో అందుబాటులో ఉంది. కొత్త ఐఫోన్‌లో ఎఐ ఫీచర్లు అందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News