Sunday, June 15, 2025

కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందగామ శివారులో కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో సిబ్బంది అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా ఆపారు. షార్ట్ సర్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News