Tuesday, September 16, 2025

పోసాని కృష్ణమురళీపై సీఐడీ కేసు నమోదు..

- Advertisement -
- Advertisement -

సినీనటుడు పోసాని కృష్ణమురళీకి షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. కూటమి నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా పోసానిపై సీఐడీ కేసు నమోదు అయ్యింది.
సీఎం చంద్రబాబును కించపరిచేలా సోషల్ మీడియాలో మాట్లాడారంటూ తెలుగు యువత రాష్ట్ర ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో పోసాని కృష్ణమురళీపై 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) బీఎన్‌ఎస్‌ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News