Monday, May 5, 2025

రాష్ట్రంలో భారీగా నాన్‌కేడర్ ఎస్పీ, అదనపు ఎస్పీల బదిలీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా నాన్‌కేడర్ ఎస్పీ, అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. సిఐడి ఎస్పీ ఎస్వీ నా గలక్ష్మిని రాచకొండ సైబర్ క్రైమ్స్ డిసిపిగా, కమాండ్ కంట్రోల్ సెంట ర్ (టెక్నికల్) ఎస్పీ కె.పుష్పాని నార్కొటిక్ కంట్రోల్ సెల్ ఎస్పీగా, సిఐ డి ఎస్పీ డాక్టర్ పి.లావణ్య నాయక్ జాదవ్‌ని హైదరాబాద్ ఉమెన్స్ సే ఫ్టీ వింగ్ డిసిపిగా బదిలీ అయ్యారు.

అదే విధంగా వెయిటింగ్‌లో ఉన్న అదనపు ఎస్పీ కె.శంకర్‌ను సిఐడి అదనపు ఎస్పీగా, అదనపు ఎస్పీ డి. ఉపేందర్‌రెడ్డిని నిర్మల్ అడిషినల్ ఎస్పీ(అడ్మిన్)గా, నిర్మల్ అదనపు ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న ఎస్.సూర్యనారాయణను టిజి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్‌గా, వెయిటింగ్‌లో ఉన్న అదనపు ఎస్పీ బి.ప్రతాప్‌కుమార్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు, అదనపు ఎస్పీ బి.శ్రీకృష్ణగౌడ్‌ను హైదరాబాద్ సెంట్రల్ జోన్ అదనపు డిసిపిగా, అదనపు ఎ స్పీ వెంకటేశ్వరబాబును ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా నియమించా రు. మరికొందరు అదనపు ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News