Sunday, September 14, 2025

అత్యంత చలి గుప్పిట్లో కశ్మీర్ లోయ

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: శ్రీనగర్, కశ్మీర్‌లోని ఇతర ప్రదేశాలు ఇప్పటివరకు ఈ సీజన్‌లో అత్యంత శీతలమైన రాత్రిని అనుభవించాయి. లోయలోని చాలా ప్రాంతాలు రాత్రిపూట సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతకు లోనవుతున్నాయని అధికారులు గురువారం తెలిపారు.

శ్రీనగర్‌లో అత్యల్పంగా మైనస్ 2.1 డిగ్రీల సెల్సియస్ నమోదైందని… మునుపటి రాత్రి మైనస్ 0.6 డిగ్రీల సెల్సియస్ నుండి 1.5 డిగ్రీలు తగ్గిందని వారు తెలిపారు. ఈ సీజన్‌లో సాధారణ రాత్రి ఉష్ణోగ్రత కన్నా 1.7 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉంది. ఖాజిగుండ్ … దక్షిణ కాశ్మీర్‌లోని లోయకు గేట్‌వే పట్టణంలో కనిష్టంగా మైనస్ 3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది, ఇది ఇప్పటి వరకు సీజన్‌లో కనిష్ట ఉష్ణోగ్రత. పహల్గాం టూరిస్ట్ రిసార్టు వద్ద నైతే చలి మైనస్ 5 డిగ్రీలుగా నమోదయింది. ఈ రిసార్టు వద్ద అత్యంత శీతల రాత్రి నమోదయింది. డిసెంబర్ 2 నుంచి అక్కడక్కడ వర్షం, మంచు కురిసే అవకాశం ఉంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News