Wednesday, September 17, 2025

ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మెదక్: ఏడుపాయల వనదుర్గామాతను సిఎం రేవంత్‌ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సిఎం పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయానికి వచ్చిన సిఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. సిఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ఎంపి రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హన్మంతు రావు, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇవాళ మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా సిఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News