Thursday, May 29, 2025

అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు సమయం కోరారు. సంధ్య థియేటర్ ఘటనలో నాంపల్లి కోర్టులో జరిగిన విచారణకు వర్సువల్‌గా అల్లు అర్జున్ హాజరయ్యారు. విచారణను జనవరి 10కి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. గతంలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ గడువు ముగియడంతో కోర్టు ముందుకు అల్లు అర్జున్ హాజరయ్యారు. డిసెంబర్ 4న  ఆర్ టిసి క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా విడుదల కావడంతో పాటు హీరో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News