Monday, July 14, 2025

పొలాల్లో బయటపడ్డ పురాతన సూర్యచంద్రుల విగ్రహాలు

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, మేదరిపేటలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయ సమీపంలో గల పొలాల్లో బుధవారం పురాతన సూర్యచంద్రుల విగ్రహాలు బయటపడ్డాయి. పొలాల్లో పనులు చేయడానికి వెళ్లిన రైతులకు పురాతన సూర్యచంద్ర విగ్రహాలు కనిపించాయి. సూర్యచంద్ర పురాతన విగ్రహాలు బయట పడడంతో సమాచారాన్ని గ్రామస్థులకు తెలియజేశారు. దీంతో మహిళలు పురాతన విగ్రహాలకు అభిషేకాలు, పూజలు చేసి టెంకాయలు కొట్టారు. పలువురు భక్తులు ఆ విగ్రహాల వద్ద పూజలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News