Friday, May 9, 2025

నల్లగొండలో కెటిఆర్‌పై రెండు కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ రజిత ఫిర్యాదుతో కెటిఆర్‌పై కేసు నమోదు చేశారు. పదో తరగతి పరీక్ష మాస్ కాపీయింగ్ ఘటనపై పోస్టులు పార్వర్డ్ చేశారని ఫిర్యాదు చేశారు. ఎ1గా మన్నె క్రిశాంక్, ఎ2గా కెటిఆర్, ఎ3గా దిలీప్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఉగ్గడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. ఎ1గా దిలీప్ కుమార్, ఎ2 మన్నే క్రిశాంక్, ఎ3గా కెటిఆర్‌పై కేసు నమోదు చేశారు. బిఆర్‌ఎస్ సోషల్ మీడియా పెట్టిన పోస్టులను పార్వర్డ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎక్స్‌లో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News