Sunday, July 20, 2025

కేరళ సిఎం కూతురిపై అవినీతి ఆరోపణలు.. విచారణకు ఆదేశం

- Advertisement -
- Advertisement -

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు బిగ్ షాక్ తగిలింది. సిఎం కూతురు వీణపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆమెను విచారించేందుకు అనుమతించింది. కంపెనీల చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ చెల్లింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎటువంటి సేవలు అందించకపోయినా ఆమెకు చెందిన ఎక్సలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ నుంచి రూ.2.73కోట్ల అక్రమం చెల్లింపులు జరిగినట్లు, ఇందులోవ వీణ ప్రమేయం ఉన్నట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించింది. ఈ క్రమంలో వీణతో పాటు ఇతర నిందితులపై విచారణకు కేంద్రం సర్కార్ అనుమతిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News