Thursday, September 18, 2025

హృదయ విదారక ఘటన.. ఫేర్‌వెల్ పార్టీలో మాట్లాడుతూ కుప్పకూలిన విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

ఫేర్‌వెల్ పార్టీలో మాట్లాడుతూ ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని పరండా తాలూకా ధారశివ్ నగరంలోని మహర్షి గురువర్య ఆర్‌జీ షిండే మహావిద్యాలయంలో చోటుచేసుకుంది. వర్ష ఖరత్ అనే 20 ఏళ్ల విద్యార్థిని కళాశాలలో చివరి సంవత్సరం చదువుతుంది.

ఈక్రమంలో కాలేజీలో నిర్వహించిన ఫేర్‌వెల్ పార్టీలో పాల్గొన్న వర్ష.. వేదికపై ప్రసంగిస్తూ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. గుండెపోటు కారణంగానే ఆమె మరణించిందని తెలిపారు. దీంతో కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News