Sunday, June 15, 2025

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇఒ నటేష్ బాబు, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News