Wednesday, April 30, 2025

ప్రజల గొంతుక బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

ఉద్యమమైనా..పాలననైనా, ప్రతిపక్షమైనా
ఒక్క గులాబీకే సాధ్యం రజతోత్సవ సభ
రాజకీయ లబ్ధి కోసం కాదు పార్టీ
ఆవిర్భవించి 25ఏళ్లు పూర్తవుతున్న
మహోన్నత నేపథ్యంలో జరుగుతున్న సభ
పల్లె పల్లె కదిలి రావాలి..సభ చరిత్రలో
నిలిచిపోవాలి 10లక్షల మందికి అన్ని
ఏర్పాట్లు చేశాం సభ ఏర్పాట్ల పరిశీలన
అనంతరం బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనేత కెటిఆర్

మనతెలంగాణ/ఎల్కతుర్తి :- చరిత్రలో ఎన్నో పారీ లు పుట్టుకొచ్చి కాలగర్భంలో కలిసిపోయినా ఒక్క బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల కోసం నిలబడి ప్రజా గొం తుకగా నిలిచిందని మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. వరంగల్ ఉ మ్మడి జిల్లా, హన్మకొండ ఎల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన బుధవా రం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అ నంతరం ముందుగా జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదు ల చేతలో హతమైన భారతీయులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ఇది ఏ రాజకీయ లబ్ధి కోస మో చేస్తున్నటువంటి సభ కాదన్నారు. టిఆర్‌ఎస్ (బిఆర్‌ఎస్) స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చే సుకున్న సందర్భంగా జరుగుతున్న సభ అని అ న్నారు. దేశ చరిత్రలో ఎన్నో పార్టీలు పుట్టుకు వచ్చి కనుమరుగై పోయాయని అన్నారు.

చివరి దాకా నిలబడింది రెండు పార్టీలు మాత్రమేనని అన్నారు. ఒకటి దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన టిడి పి, మరో పార్టీ కెసిఆర్ స్థాపించిన బిఆర్‌ఎస్ పార్టీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా కం ఠక పాలన చేస్తుంటే ఎదిరించి పోరాడే శక్తి ఒక్క బిఆర్‌ఎస్‌కే ఉందన్నారు. బిజెపి, కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు అనుకొని పనిచేస్తున్నాయ న్నారు. మూసీ ప్రాజెక్టుతో దాని పరివాహక ప్రాం త ప్రజలు ఇబ్బందులు పడుతున్నా బిజెపి నేతలకు వారి బాధలు పట్టకపోగా కాంగ్రెస్‌కు వంత పాడుతున్నారన్నారు. మూసీ, హెచ్‌యుసి, హైడ్రా లాం టి పనులతో ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేస్తూ విధ్వంసం చేస్తోందని ఆరోపించారు. ఈ అరాచకంపై ప్రశ్నించే పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఒక్క తమ పార్టీయేనని అన్నారు. ప్రజా సమస్యలపై నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పార్టీ బిఆర్‌ఎస్ అన్నారు. రజతోత్సవ బహిరంగ సభకు కొద్ది రోజుల సమయం ఉందని, పల్లె పల్లె కదిలి లక్షలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రజతోత్సవ సభకు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ సౌకర్యం హన్మకొండ వైపు నుంచి వాహనాలు సురావైన్స్ వైపు, హుజురాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎమ్మార్వో కార్యాలయం వైపు, సిద్దిపేట నుంచి వచ్చే వాహనాలు ఇంద్రనగర్‌లో మూడుచోట్ల కలిపి సుమారుగా 800 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించామని చెప్పారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సభకు వచ్చే జనాలు సేద తీరడం కోసం పది లక్షల వాటర్ బాటిల్స్, పది లక్షల మజ్జిగ ప్యాకెట్లను అవసరమనుకుంటే ఇంకెక్కువనైనా సమకూర్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నామని అన్నారు.

వేదిక చుట్టుపక్కల 10 నుండి 20 చోట్ల 100 పడకలతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని, 15 ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తూనే సమయానికి కరెంటుకోత పెడుతుందేమోనన్న ఉద్దేశంతో 240 కేవి జనరేటర్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఇప్పటికే సూర్యాపేట, వర్ధన్నపేట, తొర్రూర్ ప్రాంతాల నుండి వందలాదిగా రైతులు ఎడ్లబండ్లు కట్టుకొని బయలుదేరారని, ఇదంతా స్వచ్ఛందంగా రైతులే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతో బయలుదేరారని అన్నారు. జరగబోయే సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా 15 లక్షల ప్రజలు రాబోతున్నారని, ఇప్పటికే వాహనాలు సమకూర్చుకోవడం తోపాటు ఇంకా ఎక్కువ కూడా ఏర్పాటు చేయమని సందేశాలు పంపుతున్నారని అన్నారు. సభ నిర్వహణ అంగరంగ వైభవoగాఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమం నుండి కెసిఆర్‌కు అండగా నిలి చిందని, అందుకే వరంగల్‌లో రజతోత్సవ వేడుకల సభ ఇక్కడ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి పక్ష నేత సిరికొండ మధుసూదన చారి, నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రా జేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, బండ ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రాజయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కెటిఆర్‌కు ఘన స్వాగతం
ఎలుకతుర్తిలో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ రజతోత్సవం బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు కెటిఆర్ హైదరాబాదు నుండి కాన్వాయ్ ద్వారా వరంగల్‌కు చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలిపారు. జనగామ నుండి పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికి రైతులు కాన్వాయ్‌తో వరంగల్‌కు చేరుకున్నారు. భీమారం నుండి హసన్పర్తి వరకు కాన్వాయ్ భారీగా చేరుకుంది. సభ స్థలికి చేరుకున్న కెటిఆర్ వాహనం దిగి, సభ పరిసరాలు, ఏర్పాట్లను పరిశీలించి కొన్ని చేర్పులు, మార్పులను సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News