Monday, August 25, 2025

పార్టీలో ఉన్న వారు వెళ్లిపోతారన్న భయంతోనే కెసిఆర్ సభ:వి.హనుమంతరావు

- Advertisement -
- Advertisement -

పార్టీలో ఉన్న వారు వెళ్లిపోతారేమోనని భయపడి కెసిఆర్ ఈ రజతోత్సవ సభ పెట్టారని మాజీ ఎంపి వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర కెసిఆర్ కుటుంబం అడుక్కునేదని, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. ప్రగతి భవన్, సెక్రటేరియట్ కట్టాలని మంచి ఆలోచన కెసిఆర్‌కు వచ్చిందని, డిక్టేటర్ పాలనతో పది సంవత్సరాలు ప్రజలను అక్కడి రానివ్వలేదని ఆయన ఆరోపించారు. కెసిఆర్‌ను కెటిఆర్, హరీష్‌రావులు ముంచారని ఆయన విమర్శించారు. తెలంగాణలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి ఆప్‌కి బార్ కిసాన్ సర్కార్ అని మహారాష్ట్ర వెళ్లి కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పనికిరాని విమర్శలు చేయకుండా సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని విహెచ్ హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News