శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్’ సినిమాల యూనివర్స్‌కి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ యూనివర్స్‌లో గతంలో వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ కాగా.. గురువారం విడుదలైన హిట్-3 కూడా మంచి సక్సెస్ టాక్‌ని సంపాదించుకుంది. తొలి భాగంలో విశ్వక్‌సేన్, రెండో భాగంలో అడవి శేష్, మూడో భాగంలో నాని హీరోలుగా నటించారు. వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ సినిమాలను నిర్మిస్తున్నారు.
అయితే ఇప్పుడు ‘హిట్-4’ గురించి ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఎప్పటి నుంచో హిట్ ఫ్రాంచైజీలో కార్తీ హీరోగా నటిస్తారని టాక్ వస్తోంది. ఇప్పుడు ఈ వార్తలకు ఓ విషయం మరింత బలాన్ని అందించింది. హిట్-3 సినిమా క్లైమాక్స్‌లో కార్తీ రత్నవేల్ పాండియన్ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని గురజాడ చెప్పిన కవిత్వాన్ని చెబుతూ.. తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. దీంతో హిట్-4లో కార్తీనే హీరోగా రాబోతున్నారని అభిమానులు బలంగా ఫిక్స్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.