- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయపడి కులగణన నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కులగణన నిర్ణయం తమ విజయంగా కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కులగణన చేయాలని భావిస్తే, కాంగ్రెస్ గత 60 ఏళ్లలో ఎందుకు చేయలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సామాజిక న్యాయానికి బిజెపి కట్టుబడి ఉన్నందున కులగణన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ లాగా ముస్లింలను బిసిల జనాభాలో చేర్చి మోసం చేయం అని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటకలో కులగణనను కాంగ్రెస్ తూతూమంత్రంగా చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నిజమైన కులగణన కాదని కిషన్ రెడ్డి విమర్శించారు.
- Advertisement -