Saturday, May 3, 2025

రాజస్థాన్ పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో భాగంగా గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజ యం సాధించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా ఆరో గెలుపు కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రికెల్టన్ 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61, రోహిత్ శర్మ 36 బంతుల్లో 9 ఫోర్లతో 53 పరుగులు చేశారు. 218 పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. జోఫ్రా ఆర్చర్ (30) ఒక్కడే కాస్త రాణించాడు.ముంబయి బౌలర్లలో కరణ్ శర్మ 3, ట్రెంట్ బౌల్ట్ 3, బుమ్రా 2, దీపక్ చహార్ ,హార్థిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News