ఆరునెలల చలికాలం విరామం తర్వాత కేదార్‌నాథ్ ఆలయం శుక్రవారం తిరిగి తెరుచుకుంది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పూజలు చేశారు. ‘పహల్గాం రాక్షసుల’ను తుదముట్టించేందుకు ప్రధాని నరేంద్ర మోడీకి మరింత బలాన్ని ప్రసాదించమని ఆయన మొక్కుకున్నారు. ధామీ విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రధాని నరేంద్ర మోడీ పరమ శివభక్తుడు. 2013 విలయం తర్వాత ఆయన నేతృత్వంలోనే కేదార్‌నాథ్‌లో అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. ప్రధానికి పూర్ణాయుషు ఇవ్వాలి, ఆయనకు మరింత బలాన్ని ప్రసాదించాలి’ అని మొక్కుకున్నట్లు తెలిపారు. హిమాలయల్లో ఉన్న కేదార్‌నాథ్ మదిరం పునర్నిర్మాణం ప్రాజెక్టుకు
రూ. 2000 కోట్లకు పైగా కేటాయించి ప్రధాని సహకరించారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాక భక్తులు మరిని సౌలభ్యాలను పొందగలరు’ అన్నారు. ఆయన ఈ సందర్భంగా సోన్‌ప్రయాగ్ కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చార్‌ధామ్ యాత్రికుల రక్షణకు తాము ప్రాధాన్యతనిస్తామని ధామి స్పష్టం చేశారు. ఆయన వెంట ఆయన సతీమణి గీత కూడా కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శింకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఆయన చార్‌ధామ్ యాత్రికులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు అన్నం వడ్డించే ‘లంగర్’ (కమ్యూనిటీ కిచెన్) కార్యక్రమంలో కూడా పుష్కర్ సింగ్ ధామి దంపతులు పాలుపంచుకున్నారు.