Sunday, May 4, 2025

సరిహద్దు వెంబడి మరోసారి పాక్ కాల్పులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మళ్లీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. సరిహద్దు వెంబడి మరోసారి పాక్ కాల్పులకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత పోస్టులపై శనివారం పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత సైన్యం తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాలలో కాల్పులు జరిగినట్లు తెలిపింది. రాత్రి సమయంలో పాకిస్తాన్ సైన్యం స్వల్ప కాల్పులకు పాల్పడిందని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ కాల్పులను తిప్పికొట్టిందని చెప్పారు. కాగా, పహల్గామ్ ఉ్రగదాడి తర్వాత పాక్, భారత్ సరిహద్దులో ఉ్రదిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News