Sunday, May 4, 2025

మత్స్యకారులపై సముద్రపు దొంగల దాడి.. 17 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

చేపలు పట్టేందుకు వెళ్లిన తమిళనాడు మత్స్యకారులపై సముద్రపు దొంగలు దాడి చేశారు. ఈ ఘటన శుక్రవారం కోరమండల్ తీరంలో జరిగినట్లు తెలుస్తోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన 30 మందికి పైగా మత్స్యకారులపై కోరమండల్ తీరంలో చేపలు పడుతుండగా శ్రీలంక సముద్రపు దొంగల గ్యాంగ్ దాడి చేసింది. ఈ దాడిలో 17 మంది గాయపడ్డారు.

కోడియక్కరైకి ఆగ్నేయంగా ఫైబర్ బోట్‌లో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులపై స్పీడ్ బోట్‌లో వచ్చిన ఆరుగురు దొంగల ముఠా పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తర్వాత GPS పరికరాలు, ఫిషింగ్ వలలను దోచుకున్నారు. దొంగిలించిన వస్తువుల విలువ దాదాపు రూ. 10 లక్షలు బాధిత మత్స్యకారులు తెలిపారు. ఒడ్డుకు తిరిగి వచ్చిన తర్వాత గాయపడిన 17 మంది మత్స్యకారులు చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News