Monday, May 5, 2025

మిస్ వరల్డ్ 2025 పోటీలకు విస్తృత ఏర్పాట్లు చేయండి: రామకృష్ణ రావు

- Advertisement -
- Advertisement -

పోటీదారులకు సవివరమైన బుక్‌లెట్‌లు సిద్ధం చేయాలి
: టెలికాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 10 నుండి హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ 2025కు సంబంధించి విస్త్రత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు సీనియర్ పోలీసు అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుండి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విస్తృత స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇటివల నిర్వహించిన సమీక్షలో సూచించిన విధంగా చేపట్టిన ఏర్పాట్లపై సవివరమైన నివేదికను అందించాలని సీఎస్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ను ఆదేశించారు. విమానాశ్రయం, హోటల్స్, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించే వేదికల వద్ద గట్టి భద్రతను కల్పించాలని ఆదేశించారు. పోటీదారుల కోసం సవివరమైన బుక్లెట్ సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని జీహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. డీజిపి జితేందర్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఇతర అధికారులు ఈ టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News