Sunday, May 4, 2025

నేనే నెంబరు 1 పోప్… ట్రంప్ నయా అవతార్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వింత చేష్టకు దిగారు. ట్రంపోప్ అనే శీర్షికతో ఓ ఫోటోను సామాజిక మాధ్యమంలో ప్రవేశపెట్టారు. పోప్ వేషధారణతో ఉన్న తన ఫోటోను కృత్రిమ మేధ (ఎఐ) ద్వారా రూపొందేలా చేసి తనకు తానే మరో పోప్ అని ప్రకటించుకుంటూ చిల్లర చమత్కారానికి దిగారు. పోప్ ఫ్రాన్సికో మరణానంతరం ఇప్పటికీ కొత్త పోప్ ఎంపిక జరగలేదు. ఈ దశలో ట్రంప్ పోప్ అవతారం సామాజికంగా పలు స్థాయిలో విమర్శలకు , కొన్ని ప్రశంసలకు దారితీసింది. ట్రంప్ మాటలు చేతలు స్థాయి దాటిపోతున్నాయని, ఇప్పటి ఫోటో దశలో ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక న్యూస్ వీక్ స్పందించింది. ట్రంప్ పోప్ అవతారం ఫోటోను అధికారికంగానే వైట్‌హౌస్ తమ సామాజిక మాధ్యమం ద్వారానే వెలువరించింది. ట్రంప్ ఎంపిక ప్రక్రియ మరో రెండు మూడు రోజులలో ఆరంభం కానుంది. ఈ దశలో తానే తదుపరి పోప్ అయితే ఎంతో బాగు అని పేర్కొంటూ ఇటీవలే ట్రంప్ సెలవిచ్చారు. ఇప్పుడు ఈ మాటలను మరింత బలం చేస్తూ తానే నెంబర్ 1 పోప్ అని తెలిపే చిత్తరువులతో ఆయన తమ చపలచిత్తతను ప్రదర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News