పురపాలక శాఖకు రూ.400.36 కోట్ల ఆదాయం
గతేడాది కన్నా ఈసారి 17.68 % అధికంగా వసూళ్లు :
పురపాలక శాఖ సెక్రటరీ శ్రీదేవి
మన తెలంగాణ/హైదరాబాద్ : గత ఆర్ధిక సంవత్సరం వసూళ్లతో పోల్చితే ఈ ఆర్ధిక సంవత్సరం లో ఎర్లీబడ్ రూ.82.88 కోట్లు అధికంగా వసూళ్లు అయ్యిందని పురపాలక శాఖ సెక్రటరీ అండ్ డైరెక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఈ ఎర్లీబర్డ్ (5 శాతం రిబేటు )పథకం ద్వా రా ఈ సంవత్సరం రూ.400.36 కోట్లు (జీహెచ్ఎంసిని మినహాయించి) వచ్చిందని ఆమె తెలిపా రు. ఆస్తిపన్నుల వసూళ్లను మెరుగుపరచడానికి తాము కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ము న్సిపల్ కమిషనర్లతో నిరంతరం వీడియో, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు చేసి తగిన సూచనలు జారీ చేశామని ఆమె పేర్కొన్నారు.
అలాగే అన్ని మున్సిపల్, పురపాలక సంఘాల్లోని ఆస్తిపన్ను చె ల్లింపు దారులను ఎర్లీబర్డ్ను సద్వినియోగం చేసుకోవాలని వివిధ మాధ్యమాలు, ప్రకటనల ప్రచా రం కల్పించినట్టు ఆమె తెలిపారు. గత సంవత్స రం ఎర్లీబడ్ పథకం అమలు ద్వారా రూ 317 కో ట్ల (14.80శాతం) పన్నులు వసూళ్లు కాగా ఈ సంవత్సరం రూ.400.36 కోట్లు వచ్చాయని గతేడాది కంటే ఈసారి 17.68 శాతం అధికంగా ఈ ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని అధికారులు తెలిపారు. అయితే, ఎర్లీబర్డ్ పథకాన్ని జమ్మికుంట (54.78 శాతం), హుజురాబాద్లో (51.85%) సద్వినియోగం చేసుకోవడంతో 50% అధికంగా వసూళ్లయిన జాబితాలో ఈ రెండు మున్సిపాలిటీలు నిలిచాయి.
30 శాతం కన్నా ఎక్కువగా
వీటి తరువాత 30 శాతం కన్నా ఎక్కువగా ఎర్లీబర్డ్ వసూళ్లు అయిన జాబితాలో బొల్లారం, రామగుండం కార్పొరేషన్, గుమ్మడిదల, ఫీర్జాదిగూడ కార్పొరేషన్, తూంకుంట, మద్దూర్, గుండ్లపోచంపల్లి, నిజాంపేట కార్పొరేషన్, చౌటుప్పల్ మున్సిపాలిటీ, నాగారం, నార్సింగి, సిద్దిపేట, నారాయణఖేడ్, రాయికల్, కోదాడ ప్రాంతాలు ఉన్నాయని పురపాలక శాఖ అధికారులు తెలిపారు. నూతనంగా ఏర్పడిన పురపాలక సంఘాల్లో ముఖ్యంగా గుమ్మడిదలలో (42 శాతం), మద్దూర్లో (34.2 శాతం), గడ్డపోతారాంలో ( 26. 24శాతం), మొయినాబాద్లో (21.41 శాతం), చేవెళ్లలో (21.26 శాతం) ‘ఎర్లీబర్డ్’ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు పన్నులను చెల్లించారని అధికారులు తెలిపారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 10% కన్నా తక్కువగా
పలు పురపాలక సంఘాలు 10 శాతం కన్నా తక్కువగా ఈ ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. తక్కువ పన్నుల వసూళ్లలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, మెదక్, వర్ధన్నపేట, చేర్యాల్, వైరా, పోచంపల్లి , భైంసా, ఇంబ్రహీంపట్నం, జల్పల్లి, సదాశివపేట, వనపర్తి, ఆదిలాబాద్, దేవరకొండ, బోధన్, అశ్వారావుపేట, స్టేషన్ ఘనపూర్, ఎదుల్లాపు రం, భూపాలపల్లి, ఆసిఫాబాద్లు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.