మేషం: మేష రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా లేదు. చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అలసట మరియు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాజెక్టులు లేక ఉద్యోగం నుండి తీసివేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఎక్కువగా శివారాధన చేయడం అనేది చెప్పదగిన విషయం. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పెట్టుబడుల విషయంలో భాగస్వాములతో అన్ని విషయాలు చర్చించుకొని మీకు బాగుంటేనే ముందుకు వెళ్ళండి. సేవింగ్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సాధ్యమైనంతవరకు ప్రశాంతమైన వాతావరణాన్ని గడపడానికి ఇష్టపడతారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. చేయని తప్పుకు నిందలు పడే పరిస్థితి గోచరిస్తుంది. సహనాన్ని కలిగి ఉంటారు. వ్యాపారం పరంగా వచ్చిన లాభాలతో రుణాలు తీరుస్తారు. సుందరకాండ కానీ హనుమాన్ చాలీసా కానీ పారాయణం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు. ఋణాలు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6, కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చేసిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. గృహ నిర్మాణ సంబంధిత లోన్లు బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంతగానో శ్రమిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు కొంత కాలం వేచి ఉండడం మంచిది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన ఎక్కువ చేయడం అనేది చెప్పదగినది. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయాలని ఆలోచిస్తారు. సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదివినప్పటికీ మార్కులు తక్కువగా రావడం అనేది మీ మనోవేదినకు కారణం అవుతుంది. వేసి ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. భూ సంబంధితమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయడమనేది చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు.
మిథునం: మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి. సంతానపరమైన విషయాలు బాగున్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కష్టేఫలి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి. ఎప్పటినుండో ఇల్లు కొనుగోలు చేయాలని మీ కల ఈ వారం నెరవేరుతుంది. హౌసింగ్ లోన్ విషయంలో క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. కుటుంబ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. విద్యార్థినీ విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు మీరు అనుకున్న మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధిస్తారు. సమాజ సేవలో పాల్గొంటారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. కొంతమంది విషయంలో ఎన్ని సంబంధాలు చూసినా చేతి దాకా వచ్చి చేజారి పోతుంటాయి. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా గణపతి స్వామి వారికి అష్టోత్తరం పఠించి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి అర్థష్టమ శని పూర్తయింది. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. మీరు ఏ పని చేసినా విజయవంతంగా ముందుకు వెళుతుంది. మీరు మొదలుపెట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. ఆన్లైన్ పేమెంట్ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. విదేశాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన లావాదేవీలు నిరాశకు గురిచేస్తాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకువ అవసరం. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. నిత్యవసర సరుకులు అమ్మే వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తక్కువగా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా అష్టమూలికా తైలంతో హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని కొంత అనుకూలంగా ఉంటుంది కొంత ప్రతికూలంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. నూతన వస్తు , వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పూర్తిస్థాయిలో కాకపోయినా కొంత ఊరట లభిస్తుంది. నర దిష్టి అధికంగా ఉంటుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఋణ బాధలు తప్పకపోవచ్చు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు సానుకూల పడతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. మీ ఓర్పు సహనం చాలా విషయాలలో మీకు మేలు చేస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఇంట బయట మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టగలుగుతారు ఇది మీకు ఎంతగానో సంతోషం కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు దైవదర్శనాలు చేస్తారు. గ్యాస్ట్రిక్ సమస్యలు మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. రాజకీయరంగంలో ఉన్నవారికి ఉన్నత పదవి లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత ఇబ్బందికరమైన కాలమని చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాలలో కూడా పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవడం వలన మేలు చేకూరుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలంకార సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తుల: తులారాశి వారికి వారం బాగుందని చెప్పవచ్చు. పై అధికారులతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార పరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఈ వారం తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు ఈ వారం తొలగిపోతాయి. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది. మంచి వృద్ధిలోకి వస్తారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పక పోవచ్చు. విద్యార్థినీ విద్యార్థులకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎక్కువ మార్కులు వచ్చే చోట తక్కువ మార్కులు వస్తాయి. ఆర్థికపరమైన సమస్యలు కొంతవరకు తీరుతాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల పరంగా ఉన్నటువంటి స్థితిని కాపాడుకుంటూ మరింత పురోగతి సాధిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఈ రాశి వారు ప్రతి రోజు అష్టమూలికా తైలంతో హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి పరంగా వ్యాపార పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. ప్రభుత్వ పరమైన కాంట్రాక్టులు లీజులు, లైసెన్సులు లాబిస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా మారుతాయి. మీకున్న వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు. ఇంట్లో పెద్ద వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. బందువర్గంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. విందు వినోదాలలో ఎక్కువగా పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. నూతన గృహం కొనుగోలు చేయగలుగుతారు. లోన్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా బాగుందని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం అనేది చెప్పదగిన సూచన. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కళా సాహిత్య రంగాలలో గుర్తింపు లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యాసంస్థలు పురోగతి దశలో ఉంటాయి. శత్రువులు మీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని త్రిప్పిగొట్టగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని ప్రారంభం అయ్యింది. ప్రతిరోజు శివనామ స్తోత్రాన్ని చదివినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడవచ్చు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో దైవానుగ్రహం వల్ల మంచి లాభాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైన అంశాలు చాలా బాగున్నాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేయని తప్పుకు నింద పడవలసి వస్తుంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఎప్పటినుండో వివాహ సంబంధాలు చూసి విసిగిపోయి ఉన్న వారికి ఈ వారం ఒక మంచి సంబంధం కుదరడం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. విద్యార్థినీ విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలకు పరీక్ష రాసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి అలాగే నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అఘోర పాశుపత హోమం కూడా చేయించండి. వివాదాల నుండి బయటపడతారు. పారిశ్రామిక కళ రంగాల వారు సన్మానాలు సత్కారాలు పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాలలో నడుస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు.
మకరం: మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆగిపోయిన కన్స్ట్రక్షన్ పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సంబంధం వచ్చినప్పుడు వధూవరుల వివాహ పొంతన చూసి అన్ని బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే వివాహానంతరం చిన్నపాటి ఇబ్బందులు ఉండే పరిస్థితి గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సంతోషంగా గడుపుతారు. మీరు కలలు కన్నా స్వగృహ యోగాన్ని ఏర్పరచుకుంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకే లభిస్తుంది. స్థిరాస్తులను వృద్ధి చేసుకోవాలనుకునే మీ ఆలోచనలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు నిర్విఘ్నంగా సాగుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ శక్తి సామర్థ్యాలకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయంలో అంత అనుకూలంగా లేరు. కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగం మారవలసిన పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారంలో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో మరీ ఎక్కువగా నష్టాలు రాకుండా ఉండటానికి మీ వంతు కృషి చేస్తారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. విద్యార్థినీ విద్యార్థులకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కెరియర్ పరంగా స్థిరత్వం కోసం కష్టపడతారు. రాజకీయపరంగా మంచి స్థితిని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు డార్క్ మెరూన్. ప్రతి మంగళవారం మరియు శనివారం రోజున నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. మీనం: మీన రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఆర్థికపరంగా ఈ వారం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. గృహం లేదా వాహనం కొనుగోలు చేస్తారు. ఋణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి వివాదాలు ఓ దరికి చేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభం కావడం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. నూతన వ్యాపారం లాబిస్తుంది. ఎగుమతి దిగుమతికి సంబంధించిన వ్యవహారాలలో కాస్త మెలకువలు అవసరం. ఎటువంటి బెట్టింగ్ లలో పాల్గొనవద్దు నష్టపోతారు. ప్రభుత్వపరమైన ఉత్తర్వులు కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. ఈ. ఎ. న్టీ సమస్యలు బాధించే అవకాశం ఉంది. కాలభైరవ రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు కూడా దుర్గాదేవి అష్టోత్తరం పఠించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.