కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ బ్యానర్‌లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సింగిల్’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలమ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. సింగిల్ మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఇవానా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమా కథ చాలా నచ్చింది. ఇందులో శ్రీ విష్ణు. వెన్నెల కిషోర్, కేతిక ఇలా చాలా అద్భుతమైనటువంటి నటులు ఉన్నారు. గీత ఆర్ట్ లాంటి గొప్ప సంస్థ ఉంది. నేను తెలుగులోకి రావడానికి ఇదే సరైన సినిమా అనిపించింది.
-ఇందులో హరిణి అనే పాత్రలో కనిపిస్తాను. తను డాన్సర్. తన క్యారెక్టర్ లో చాలా ఎమోషన్ ఉంటుంది. కుటుంబ బంధాలు ఉంటాయి. తాను ఎవరినైనా ఇష్టపడితే వాళ్లకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది. ఈ పాత్రలో చాలా ఎంజాయ్ చేశాను. -ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడానికి చాలా ప్రయత్నించాను. -శ్రీ విష్ణు తెలుగుని చాలా స్పీడ్ గా మాట్లాడుతారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు. తర్వాత మెల్లమెల్లగా అలవాటు పడ్డాను. -ఇది చాలా ఫన్ మూవీ. ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్స్‌లో చాలా ఎంజాయ్ చేయొచ్చు. లాఫ్ రైడ్‌లా ఉంటుంది.ఈ సినిమా కోసం శ్రీ విష్ణు నాకు డైలాగ్స్ రాసి ఇవ్వడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. అలాగే కేతిక శర్మతో వర్క్ చేయడం కూడా మరచిపోలేనిది. డైరెక్టర్ -కార్తీక్ తమిళ్ పర్సన్. ఆయనతో నేను తమిళ్ లోనే మాట్లాడేదాన్ని. ఆయన చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. -ఇక ప్రస్తుతం తమిళ్‌తో పాటు తెలుగులో సినిమాలు చేస్తున్నాను”అని అన్నారు.