Sunday, August 31, 2025

ఆత్మవిశ్వాసంతో పంజాబ్ కింగ్స్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా జరిగే కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని పంజాబ్ భావిస్తోంది. ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో గెలవడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లు ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ శ్రేయస్ కూడా జోరుమీద ఉన్నాడు. ఇక లక్నోలో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. మార్ష్, మార్క్‌క్రమ్, పూరన్, రిషబ్‌లతో లక్నో బలంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News