Monday, May 5, 2025

భారత్ పై అణ్వాయుధాలతో విరుచుకుపడతాం: పాక్

- Advertisement -
- Advertisement -

పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత ప్రభుత్వం వరుస సమావేశాలు నిర్వహించి బాధ్యులకు తగిన బుద్ది చెప్పాలని నిర్ణయించింది. ఈ దాడిలో పాక్ హస్తం ఉందని.. దాయాది దేశంతో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. ఈ విషయంలో మోడీ సర్కార్.. భారత ఆర్మీకి పూర్తి స్వేచ్చ ఇచ్చింది. దీంతో ఏ క్షణమైనా భారత్ దాడి చేసే అవకాశం ఉందని.. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలకు భారీగా సైన్యాన్ని, యుధ్ద విమానాలను దింపింది. అయితే, దాడి జరిగినప్పటి నుంచి భారత్ నిశబ్దంగా ఉండటంతో.. ఎదో జరుగుతుందని పాక్ ఆందోళనలో ఉంది.

ఈ క్రమంలో పాకిస్తాన్.. బెదిరింపులు, కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే, సింధు జలాలను మళ్లించేందుకు భారత్ చేపట్టే ఏ నిర్మాణమైనా ధ్వంసం చేస్తామని పాక్ మంత్రి బెదిరింపు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలీ కూడా.. భారత్ పై అణ్వాయుధాలతో విరుచుకుపడతామని బెదిరించే ప్రయత్నం చేశారు. రష్యాలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఖలీద్ మాట్లాడుతూ.. భారత్, తమ దేశంపై సైనిక చర్య ప్రారంభిస్తే.. పాక్ అణ్వాయుధాలను దాడి చేస్తుందని చెప్పాడు.

“భారత ఉన్మాద మీడియా, ఆ వైపు నుండి వస్తున్న బాధ్యతారహిత ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైన పత్రాల్లో భారత్, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.  తమ దేశంపై దాడి జరగబోతోందని.. ఒకవేళ భారత్, యుద్దానికి వస్తే.. పాక్ అణ్వాయుధాలతో సహా పూర్తి శక్తిని ప్రయోగిస్తుంది” అని ఖలీద్ బెదిరించే ప్రయత్నం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News