ఆర్టీసి కార్మకులు సమ్మెకు పిలుపు నివ్వడంతో వారితో తెలంగాణ ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్టీసి కార్మికులతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యంపైనే ఆర్టీసీ నడుస్తోందన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆర్టీసి కార్మికులు సహకరించాలని కోరారు. 5, 6 తేదీల్లో ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని మంత్రి తెలిపారు. పదేళ్లుగా ఆర్టీసి నిర్వీర్యమైందని.. ఆర్టీసి ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు. ఇలాంటి సమయంలో ఇబ్బందికర పరిస్థితులు తేవొద్దని మంత్రి పొన్నం అర్టీసి కార్మికులను కోరారు.
కాగా, తెలంగాణ వ్యాప్తంగా మే 7 నుండి ఆర్టీసి కార్మికుల నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలసిందే. ఆర్టీసి పరిరక్షణ, విలీన ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ.. మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నట్లు కార్మికులు ప్రకటించారు.