సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలను వణికించిన వాన మార్కెట్ యార్డులలో
కొట్టుకుపోయిన ధాన్యం వడగండ్ల వానతో పలు చోట్ల నేలకొరిగిన చెట్లు,
వివిధ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/కామారెడ్డి : సిద్దిపేట, కామారెడ్డి జిల్లా ల్లో ఆదివారం భారీ వర్షాలు పడ్డాయి. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సాయంత్రం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలతో వరితో పాటు మామిడి తోటలు, అనేక పంటలకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లా కేంద్రంతోపా టు జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఈదురుగాలులతో కూడి న వర్షం కురిసింది. అనేక గ్రామాల్లో చెట్లు కూలి రోడ్లపైనే పడ్డా యి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేటతో పాటు దుబ్బాక మార్కెట్ యార్డులలో ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా అనేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది.
చిన్నకోడూరు, దౌల్తాబాద్‌లతో పలు మండలల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు గ్రామా ల్లో చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రేకులతో కూడిన ఇంటిపై కప్పులు ఈదురు గాలుల బీభత్సానికి కొట్టుకుపోయాయి. తొ గుట మండల కేంద్రంలో ఆటోపై చెట్టు కూలింది. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపైనే పడ్డాయి. దుద్దెడ టోల్‌గేట్ లో పైకప్పు భాగం కూలి రోడ్డుపై పడింది.
కోహెడ మండల వ్యా ప్తంగా ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు ప్రజలను తీవ్రభయాందోళనలకు గురిచేశాయి.కోహెడ మండల కేంద్రంలో విద్యుత్ స్తంభం నెలకొరగా, విద్యుత్ తీగలు తెగిపడ్డా యి. కొన్ని చోట్ల చెట్లు విరిగి పడటంతో ఇంటి పైకప్పు ప్రహరీ గోడలు ధ్వం సమయ్యాయి. కామారెడ్డి జిల్లా, రాజంపేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావారణం చల్లబ డి ఈదురు గాలులతో పాటు రాళ్ల వర్షం కురవడంతో రైతులు అ తలాకుతలమయ్యారు. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతు లు ఆందోళనకు గురయ్యారు. ఈదురుగాలులతో రాళ్ల వర్షం ప డడంతో రోడ్లపైన చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలకు అంతరా యం కలిగింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.