Monday, May 5, 2025

కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం

- Advertisement -
- Advertisement -

ఎస్‌ఎల్‌బిసిని మేమే పూర్తిచేస్తాం
నీటిపారుదల మంత్రి ఉత్తమ్
కుమార్‌రెడ్డి సాగర్ ప్రాజెక్టు
పూడికతీత పనులను
ప్రారంభించాం ఆర్‌అండ్‌బి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మన తెలంగాణ/మిర్యాలగూడ: సామాజిక న్యా యం కాంగ్రెస్‌తోనే సాధ్యమని నీటిపారుదల, పౌ రసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అ న్నారు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ ఎస్‌పి కన్వెన్షన్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు, పౌరసరఫరాలపై ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే లక్షంగా పనిచేస్తోందని అన్నారు. గత ప్రభు త్వం లక్ష ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖ ర్చు చేసి నామామాత్రపు ఆయకట్టుకు సాగునీరు అందించిందని, తాము అధికారంలోకి వచ్చిన త ర్వాత అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నామని అన్నారు.

ఇందు లో భాగంగా ఈ సంవత్సరం బడ్జెట్లో రూ.23, 000 కోట్లు ఇరిగేషన్‌కు కేటాయించామని తెలిపారు. దీంతో పాటు 1100 మంది ఇంజనీర్లను కేటాయించి నీటిపారుదల శాఖ బలపడేలా ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రత్యేకించి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూడికతీత పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎస్‌ఎల్‌బిసి పనులకు ముం దుకు తీసుకెళ్లేందుకు జాతీయ స్థాయిలో చర్చిం చి ఒక నిపుణుల కమిటీని వేసి ఆ కమిటీ సూచనల మేరకు పనులు ముందుకు తీసుకెళ్తామని, త్వరలోనే ఎస్‌ఎల్‌బిసి టెన్నల్ పనులను పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ధర్మారెడ్డి పి ల్లాయిపల్లి, బ్రాహ్మణవెల్లంలో కాలువలను సైతం పూర్తి చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను అవసరమైన నిధులు కేటాయించి చేపడుతున్నామన్నా రు. బ్రాహ్మణ, వెల్లెముల ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల భూగర్భజలాలు పెరిగాయన్నారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడు తూ.. వేసవిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల కింద నిర్వహణకు నిధులు కేటాయించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News