Monday, May 5, 2025

ఇజ్రాయెల్‌కు హౌతీల షాక్

- Advertisement -
- Advertisement -

ఊహించని రీతిలో ఎయిర్‌పోర్టు సమీపంలో
క్షిపణి దాడి టెల్ అవీవ్‌కు విమాన
సర్వీసులు నిలిపివేసిన భారత్ హౌతీ
తిరుగుబాటుదారులపై దారుణమైన
దాడులు చేస్తాం ఇజ్రాయెల్ ప్రధాని
నెతన్యాహు హెచ్చరిక

టెల్ అవీవ్ : యెమన్ కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఆదివారం ఇజ్రాయిల్ పై ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి కారణంగా అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం టెల్ అవీవ్ వెలుపల ఉన్న బెన్ గురియన్ విమానాశ్రయం వద్ద 25 అడుగుల గుంతపడింది. విమానాశ్రయం టెర్మినల్ 3 కు 75 మీటర్ల దూరంలో ఈ గుంత ఏర్పడింది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగు అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. దానిని అధిగమించి బాలిస్టిక్ క్షిపణి చేరడంతో షాక్ తిన్న ఇజ్రాయెల్ వైమానిక రక్షణ ఉల్లంఘనపై సీరియస్ అయింది. క్షిపణి ఢీకొన్న ప్రదేశంపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించింది. ఈ దాడిలో కనీసం 8 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ జాతీయ అత్యవసర సేవసంస్థ పేర్కొంది. క్షిపణిని నివారించడానికి తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ అంగీకరించింది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో ల్యాండ్ అయ్యేలోపు పొయగలు కమ్ముకునట్లు పేర్కొంది.క్షిపణి దాడి వల్ల టెర్మినల్ కు ఎలాంటి నష్టం జరగకున్నా. టెర్మినల్ లోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
టెల్ అవీవ్‌కు విమానాలు నిలిపివేసిన ఎయిర్ ఇండియా
హౌతీ క్షిపణి దాడి తర్వాత టెల్ అవీవ్ కు విమానసర్వీసును ఎయిర్ ఇండియా మే6 వరకూ నిలిపివేసింది. బెన్ గురియన్ విమానాశ్రయానికి వెళ్లాల్సిన ఢిల్లీ – టెల్ అవీవ్ విమానాన్ని అబూదాబికి మళ్లించారు. క్షిపణి దాడి నేపథ్యంలో టెల్ అవివ్ కు రెండు రోజుల పాటు విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టెల్ అవీవ్ కు వెళ్లే విమానాన్ని అబుదాబి మళ్లించింది. అంతే కాదు చెల్లుబాటు అయ్యే టికెట్లు ఉన్న వారికి రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈనిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News