128వ ఏట తుదిశ్వాస
2022లో పద్మశ్రీతో
సత్కరించిన కేంద్ర ప్రభుత్వం
ప్రధాని మోడీ సహా పలువురు
ప్రముఖుల సంతాపం
వారణాసి: ఆరోగ్య సమస్యల కారణంగా ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ గ్రహీత బాబా శివానంద శనివారం రాత్ర కన్నుమూశారు. ఆయన వ యస్సు 128 సంవత్సరాలుంటుందని ఆయన శిష్యులు తెలిపారు. బాబా శివానందను ఏప్రిల్ 30న బిహెచ్‌యూ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన పార్థీవ శరీరానికి అంజలి ఘటించడానికి ఆయన భౌతిక కాయాన్ని కబీర్‌నగర్ కాలనీలోని ఆయన ఇంట్లో ఉంచారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన అనేక తరాలకు స్ఫూర్తి ప్రదాత అని ప్రధాని నరేంద్ర మోడీ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో కీర్తించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న సిల్హెట్‌లో 1896 ఆగస్ట్ 8న ఆయన జన్మించారు. ఆయనకు ఆరేళ్ల వయస్సు ఉ న్నప్పుడు ఏర్పడిన క్షామంలో ఆయన తల్లిదండ్రులు మరణించారు. నాటి నుంచి ఆ యన పొదుపు, క్రమశిక్షణ, సగం కడుపుకే తినడం వంటి పద్ధతులు అలవరచుకున్నారు. యోగ, ఆధ్యాత్మికత ద్వారా సమాజానికి సేవలందించినందుకుగాను ఆయనకు 2022లో పద్మశ్రీ అవార్డును బహుకరించారు.