- Advertisement -
రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్ ఎల్‌పి బ్యానర్‌పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం మేకర్స్ జాను మేరి జాను సాంగ్‌ని రిలీజ్ చేశారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర ఈ సాంగ్‌ని క్యాచి ట్యూన్‌గా కంపోజ్ చేశారు. వినాయక్ ఈ పాటని ఎనర్జిటిక్‌గా పాడారు. శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సాంగ్‌లో రాజ్ తరుణ్, రాశి సింగ్ కెమిస్ట్రీ ఆసక్తికరంగా ఉంది. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
- Advertisement -