Monday, May 5, 2025

మహబూబాబాద్‌ లో రోడ్డు ప్రమాదం.. బీఎస్‌ఎఫ్‌ జవాను మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను మృతి చెందాడు. ఆదివారం ఉదయం కొత్తగూడ మండలం అందుగులగూడెంకు చెందిన మద్దెల ప్రకాశ్‌ బైక్ పై వెళ్తూ.. పెగడపల్లి వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ప్రకాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు చికిత్స కోసం వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి వరంగలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ప్రకాశ్ ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్‌.. ఇటీవల సెలవుపై స్వగ్రామం అందుగులగూడెం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News