Monday, May 5, 2025

దిల్ రాజు ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో దిల్ రాజు ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం. ఈ స్టూడియో ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్‌ని నెక్ట్ లెవల్‌కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లోర్వెన్ ఏఐ స్టూడియోని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘హాలీవుడ్‌కి ధీటుగా హైదరాబాదు ఎదుగుతోంది. ఈరోజు జరిగిన నాలుగు ప్రొడక్ట్స్ లాంచ్ ఎంటర్టైన్మెంట్‌లో గేమ్ చేంజెర్స్ అనిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీని మూవీతో మిళితం చేయడమనేది ఎంటర్టైన్మెంట్ నెక్ట్ లెవెల్ స్టెప్. దిల్ రాజు, వారి టీం కలిసి చేసిన ఈ ప్రోడక్ట్ అద్భుతం. చాలా సినిమాలు ఎఐ ఆధారంగా వస్తున్నాయి.

దిల్ రాజు లాంటి కింగ్ ఆఫ్ మూవీ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఏఐలోకి రావడం శుభ పరిణామం’ అని అన్నారు. నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ.. ‘స్క్రిప్టు ఐడియా నుంచి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యే వరకు. న్యూ కమ్మర్స్‌కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అభివృద్ధి చేయడం జరిగింది. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మేజర్‌గా ప్రీ ప్రొడక్షన్ గురించి ఎంత టెన్షన్ పడుతున్నామో సినిమా వాళ్ళకి తెలుసు. సెకండ్ స్టేజ్ ప్రీ ప్రొడక్షన్. తర్వాత షూటింగ్ ప్రాసెస్, పోస్ట్ ప్రొడక్షన్. తర్వాత ప్రమోషన్స్. ఇలా స్టెప్ బై స్టెప్‌గా డెవలప్ డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత చేసే ప్రీ ప్రొడక్షన్‌ని ఎఐలో ఎలా చేయొచ్చు అనేది చేయడం జరిగింది. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది.

చాలామంది డైరెక్టర్స్‌కి ప్రొడ్యూసర్స్‌కి దీని గురించి చూపించడం జరిగింది. అందరూ దీన్ని ప్రశంసించారు‘ అని తెలిపారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు ప్రతి దాంట్లో ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు అదే క్రమంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఏఐని ప్రవేశ పెట్టడంలో ముందడుగు వేశారు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఘా దిల్ రాజు, కె. రాఘవేంద్ర రావు, వివి వినాయక్, అనిల్ రావిపూడి, సుకుమార్, వంశీ పైడిపల్లి, నాగ్ అశ్విన్, బాబీ, టీజీ విశ్వప్రసాద్, కేఎల్ దామోదర్ ప్రసాద్, సాహు గారపాటి, ఇంద్రగంటి మోహన కృష్ణ, వేణు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News