తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసి సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసి కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో స్పందించిన మంత్రి పొన్నం.. సమ్మె చేయొద్దని, చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో సోమవారం మంత్రి పొన్నంను ఆర్టీసి సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసి సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఆర్టీసి పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు.
కాగా, తెలంగాణ వ్యాప్తంగా మే 7 నుండి ఆర్టీసి కార్మికుల నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలసిందే. ఆర్టీసి పరిరక్షణ, విలీన ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ.. మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నట్లు కార్మికులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తోంది.