Saturday, September 13, 2025

యువతిపై అత్యాచారం.. నటుడిపై రేప్ కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు, ‘బిగ్ బాస్’ ఫేమ్ అజాజ్ ఖాన్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదుతో ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఖాన్ తన ‘హౌస్ అరెస్ట్’ షోలో హోస్ట్ చేసే అవకాశం ఇస్తానని ఫోన్ చేశాడని… తరువాత ఇంటికి వచ్చి బలవంతంగా తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ సంఘటన తర్వాత సదరు యువతి ముంబైలోని చార్కోప్ పోలీస్ స్టేషన్‌లో అజాజ్ ఖాన్ పై ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64, 64(2M), 69, 74 కింద కేసు నమోదు చేశారు. కాగా, తన షో ‘హౌస్ అరెస్ట్’లో అనుచిత కంటెంట్ ప్రసారం చేశారని ఇప్పటికే అజాజ్ ఖాన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News