- Advertisement -
సంగారెడ్డి: కొండాపూర్ మండలం మల్కపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులు తండ్రి సుభాష్(42), పిల్లలు మారిన్(13), ఆరాధ్య(10)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి పిల్లల మృతితో మల్కపూర్‌లో విషాధఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -