ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుని శ్రేయస్ అయ్యార్ విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో ఆడిన 11 మ్యాచుల్లో ఏడు మ్యాచుల్లో గెలిచి టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. దీంతో పంజాబ్ ప్లేఆఫ్ష్‌కి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వివిధ జట్ల తరఫున(ఢిల్లీ, కెకెఆర్, పంజాబ్) 81 మ్యాచుల్లో కెప్టెన్సీ చేసిన అయ్యర్ 45 విజయాలు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో కనీసం 80 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన వారిలో శ్రేయస్‌దే అత్యధిక విజయాలశాతం.
ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును శ్రేయస్ అధిగమించాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచులకు కెప్టెన్సీ చేసిన ధోనీ 1 మ్యాచులో మాత్రమే జట్టును గెలిపించాడు. దీంతో అతని గెలుపు శాతం 58.82 నుంచి 57.72కు తగ్గింది. అయితే శ్రేయస్ విజయశాతం 81 మ్యాచుల్లో 58.22కు పెరిగి ధోనీ రికార్డును దాటేసింది. గత సీజన్‌లో కెకెఆర్‌ను విన్నర్‌గా, అంతకు ముందు ఢిల్లీని రన్నర్‌ఆప్‌గా నిలిపిన శ్రేయస్ మరి ఈ సీజన్‌లో పంజాబ్‌ను ఎక్కడ నిలబెడతాడో వేచి చూడాలి.